హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎంఎల్ఏ హరీశ్ రావుపై కేంద్ర హోంశాఖ సహయక మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు మంచి రాజకీయ నాయకుడని, ఉద్యమనాయకుడిగా ఆయనకు ప్రజల్లో మంచి పేరుందని బండి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. నేను ఇలా అన్నానని హరీశ్ రావు నాకు కాల్ చేశాడని అనుకోవద్దని, బీజేపీ పార్టీలో చేరుతున్నాడని అనుకోవద్దని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఒకవేళ హరీశ్ రావు బీజేపీలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని ఆయన చెప్పారు. హరీశ్ రావుకు ప్రజాభిమనం ఉందని, మళ్లీ ఎన్నికలు పెట్టిన సునాయాసంగా గెలుస్తాడని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలని చాలా మందికి ఉందని, పార్టీలో చేరామని మేం ఎవరినీ అడగడం లేదన్నారు. ఏ ఎంఎల్ఏ బీజేపీలోకి వచ్చినా సారే రాజీనామా చేసి రావాల్సిందే అని, బీజేపీలో చేరినవారిని గెలిపించుకునే బాధ్యత మాదేన్నాని బండి సంజయ్ పేర్కొన్నారు.