calender_icon.png 15 April, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించింది: బండి సంజయ్

14-04-2025 04:14:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని సోమవారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి సీహ్చ్ శేఖర్ జీ తదితరులతో కలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కి చరిత్రలో సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు, దళిత, గిరిజన బిడ్డలకు రాష్ట్రపతి పదవులు దక్కేలా చేసిందని కొనియాడారు.

బిసి, ఎస్సి, మహిళలకు కేబినెట్ లో ఎక్కువ స్థానాలు కల్పించి అంబేద్కర్ ఆశయ సాధనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ ఆదేశించడం హాస్యాస్పదం అని, అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ తీరు చంపినోడే సంతాప సభ పెట్టినట్లుందని విమర్శించారు. భారతరత్న ఇవ్వకుండా, ఎన్నికల్లో ఓడించి, అడుగడుగునా అవమానించి, చివరకు పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఖననం చెయ్యనివ్వని చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానిస్తే, బిజెపి ఆయనను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నదన్నారు. అంబేద్కర్ పై కాంగ్రెస్ కుట్ర చేసి రెండుసార్లు డూప్టికేట్ గాంధీ కుటుంబం ఓడించిందని, తక్షణమే బడుగు , బలహీనవర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.