calender_icon.png 27 October, 2024 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలే..?

27-10-2024 04:24:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలంటూ పేదల ఇళ్లను కూలుస్తున్నారు. కానీ, అనుమతుల్లేని కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలేదు..? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా కేటీఆర్ కు మినహాయింపు ఇచ్చారా..? అని బండి అడిగారు. జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీపై బండి సంజయ్ స్పందించారు. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను ముందుగానే తరలించారని, ఫైళ్లు తరలింపు విషయం తెలిసే ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.

రేవ్ పార్టీలో కేటీఆర్ కుటుంబసభ్యులున్నారని తప్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంవల్లే డ్రగ్స్ దొంగలు పారిపోయేలా చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పారిపోయిన దొంగలెవరు..? వారికి సహకరించిన వ్యక్తులెవరు..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ పార్టీలో పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించారన్నారు. ఫామ్ హౌస్ కేసులో ఎవరున్నా వదలొద్దని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటి కాదనుకుంటే నిజాలు ప్రజల ముందుంచాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు.