calender_icon.png 22 December, 2024 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర: బండి సంజయ్

22-12-2024 03:43:23 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా ముఖ్యమంత్రి వ్యవమరిస్తున్నారన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత మహిళ కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని చెప్పారు. సమస్య ముగిశాక శాసనసభలో ఎంఐఎం సభ్యుడితో కాంగ్రెస్ నాయకులు ప్రశ్న అడిగించారని బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీలో సినిమా తరహా కథ అల్లి.. మళ్లీ సంధ్య థియేటర్ తొక్కిసలాట కథను మొదటికి తెచ్చారని మండిపడ్డారు.

ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండ్రిస్ట్రీని దెబ్బతీసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ ను ఎంఐఎం నిండా ముంచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను నమ్మితే బీఆర్ఎస్ గతేపడుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ జోష్యం చెప్పారు. కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు. ఏనాడైనా గురుకుల విద్యార్థులను పరామర్శించారా..?, విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించారా.. ? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా..? అని అడిగారు. ఇకనైనా ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలు వీడాలి.. వీడకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ గతే పడుతుందని బండి సంజయ్ హెచ్చారించారు.