calender_icon.png 30 October, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు తెచ్చే బాధ్యత నాది: బండి సంజయ్

14-07-2024 12:52:56 PM

కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతా

అద్బుతమైన ప్రణాళిక రూపొందించండి

అభివృద్ధిలో నా మార్క్ చూపిస్తా...

అందరం కలిసి కరీంనగర్ అభివ్రుద్ధి కోసం పనిచేద్దాం

బండి సంజయ్ కు మేయర్ సహా కరీంనగర్ కార్పొరేటర్ల వినతి

కరీంనగర్: స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపే కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను సన్మానించారు. మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిళ్ల రమేశ్, అబ్బాస్ షమీ సహా 30 మందికిపైగా కార్పొరేటర్లు హాజరై బండి సంజయ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు.

తమతో కలిసి కార్పొరేటర్ గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. ‘కరీంనగర్ అభివ్రుద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాది.’ అని హామీ ఇచ్చారు. జన్మనిచ్చి నన్ను ఇంత వాడిని చేసిన కరీంనగర్ ను అద్బుతంగా అభివ్రుద్ది చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనచేస్తున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే.. ఇలాంటి సందర్భం వస్తుందని, అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన నన్ను గుర్తించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. కార్పొరేటర్ గా ఎన్నిక కావడం మామూలు విషయం. సమస్యలపై అవగాహన తెచ్చుకుని పరిష్కరించాలంటే కిందిస్థాయి నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్లకే సాధ్యం. ఇక్కడున్న కార్పొరేటర్లలో భవిష్యత్తులో ఎంపీ, కేంద్ర మంత్రి కావొచ్చు అన్నారు. ఈరోజు దేశమంతా చర్చ జరుగుతోంది. మామూలు కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి కాగాలరని చర్చ జరుగుతోంది. గతంలో కార్పొరేటర్లందరం కలిసి ఉండేవాళ్లం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకునే వాళ్లం. కానీ గత కొంత కాలంగా కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చింది. ఇకపై గొడవల్లేకుండా కలిసి పనిచేయాలని కోరుతున్నానని ఈ సందర్భగా కార్పొరేటర్ గా ఉన్నప్పటి అనుభవాలను సంజయ్ గుర్తుచేసుకున్నారు.