calender_icon.png 23 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజర్ విడుదలచేసిన బండి సంజయ్

19-02-2025 12:00:00 AM

‘మర్డర్’ ఫేమ్ ఘన ఆదిత్య కథానాయకుడి గా, కొత్తమ్మాయి ప్రియ కథానాయకిగా యువ దర్శకుడు రాజ్ లోహి త్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తకిట తధిమి తందాన’. ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చందన్‌కుమార్ కొప్పుల నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తకిట తధిమి తందాన’ టీజర్ యువతతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీఎన్ అంజన్; సంగీతం: నరేన్‌రెడ్డి; పాటలు: శ్రేష్ట, రచనా సహకారం: దిలీప్ అరుకొండ; ఎడిటర్: హరిశంకర్.