calender_icon.png 30 October, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిశా బస్సు దుర్ఘటనపై స్పందించిన బండి సంజయ్

13-07-2024 07:06:11 PM

హైదరాబాద్ : ఒడిశాలో జరిగిన బస్సు దుర్ఘటనపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించారు. బండి సంజయ్ ఆదేశాల మేరకు హోంమంత్రిత్వశాఖ కార్యాలయం ప్రమాద ఘటన, గాయపడిన ప్రయాణీకుల పరిస్థితిపై మయూర్ బంజ్ జిల్లా మెజిస్ట్రేట్, సీడీఎంఓ, ఆసుపత్రి సూపరిండెంట్, మెడికల్ కాలేజీ అధికారులతో  ఆరా తీసింది.  

ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మరో 14 మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తక్షణమే వారి స్వస్థలానికి తరలించాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించారు.