హైదరాబాద్,(విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై నిరసనగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఏబీవీపీ నేతలపై దాడి దుర్మార్గామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతి చెందిన విద్యార్థినికి న్యాయం చేయాలని అడిగితే దాడి చేయిస్తారా..?, విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా..?, బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?, బాసర విద్యార్థుల డిమాండ్లను ఎందుకు పరిష్కరించట్లేదు..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన స్వాతిప్రియ అనే విద్యార్థిని సోమావారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.