calender_icon.png 23 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్

23-12-2024 01:49:20 PM

సికింద్రాబాద్,(విజయక్రాంతి): హకీంపేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.  340 మందికి నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. ఇప్పటికే 8.50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ కల్పన ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని ఆయన వెల్లడించారు. సీఐఎఎస్, బీఎస్ఎఫ్, ఐటీవీపీ, ఐఐటీ లలో ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ చేరలన్నదే బీజేపీ పార్టీ ఆకాంక్ష అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. దళారీలు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేవలం మోదీ ప్రభుత్వమే అన్నారు. స్టార్ట్ ఆప్ ఇండియాలతో ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ యుగాన్ని తీసుకొచ్చి దేశ స్థితి గతులను మర్చారని, వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.