calender_icon.png 15 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాదేవికి నివాళులర్పించిన బండి సంజయ్

04-08-2024 01:23:40 AM

కరీంనగర్, ఆగస్టు 3 (విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి సంస్మరణ సభను శనివా రం చొప్పదండిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరై, రూపాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశా రు. వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్ కూడా హాజరై నివాళులర్పించారు. సంస్మరణ సభకు చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.