15-02-2025 12:52:28 PM
హైదరాబాద్: ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఆదేశించారు. భారత్ నుంచి వెళ్లి పాకిస్థాన్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎనిమీ ప్రాపర్టీ(Enemy Property)స్ పై కేంద్ర, రాష్ట్ర అధికారులతో సంజయ్ సమీక్షించారు. మార్చిలోపు ఆస్తులు లెక్క తేల్చాలని బండి సంజయ్ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్(Hyderabad, Rangareddy, Kothagudem, Vikarabad) జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్( Bandi Sanjay Kumar) తెలిపారు.