calender_icon.png 27 October, 2024 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ బామ్మ‌ర్ది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలా..?

27-10-2024 12:37:15 PM

హైదరాబాద్: కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌజ్ లోనే రేవ్ పార్టీలా..? రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పై కేటీఆర్ ఇప్పుడేమంటారో..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.

బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలన్నారు. నార్సింగి పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ), ఎక్సైజ్‌ శాఖ అధికారుల సహకారంతో హైదరాబాద్‌ శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌పై అక్టోబర్‌ 27 తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతులు లేకుండా జన్వాడలో మద్యం అందిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు గుర్తించారు.