కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ యుద్దం ప్రకటించబోతోంది
మహారాష్ట్రలో పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టబోతోంది
కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ.. ఆ పార్టీ జతకడితే మునుగుడు ఖాయం
మహారాష్ట్రలో కాంగ్రెస్ అబద్దాలను జనం ఛీకొట్టారు
మోదీ అభివ్రుద్ధి మంత్రం పనిచేసింది
కులగణన పెద్ద బోగస్...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్, (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివ్రుద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమ్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్.... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయ ఆవరణలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు...