calender_icon.png 23 January, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కావాలా?... ఉగ్రవాద పునరద్దురణ కావాలా?

08-09-2024 11:30:59 AM

370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ ను అభివ్రుద్ది చేస్తున్నాం

370 ఆర్టికల్ ను మళ్లీ తెచ్చి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని కాంగ్రెస్ కూటమి యత్నిస్తోంది

దేశ యువకులారా.... కాశ్మీర్ ప్రజలకు అప్పీల్ చేయండి

భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు

రాజకీయాలను పక్కనపెట్టి వాళ్లను ఆదుకుందాం

వరద బాధితులకు చేతనైనంత సాయం చేయండి

కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్....

కరీంనగర్,(విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను ఇవ్వాలని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాదులతో లింకులున్న పార్టీలతో జత కట్టి మళ్లీ 370 ఆర్టికల్ ను తీసుకొచ్చి ఉగ్రవాద హోదాను పునరుద్దరించాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. దేశ ప్రజలారా... ఆలోచించండి. జమ్మూకాశ్మీర్ ప్రజలకు మీరంతా అప్పీల్ చేయండి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద గణేశ్ మండపాన్ని దర్శించుకున్న బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు దీక్ష తీసుకుని భక్తి యుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంజయ్ ఏమన్నారంటే...

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు కురవాలని వానదేవుడిని కోరుకుంటున్నా. అట్లాగే వర్షాలతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్రం కూడా తనవంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది.  రాజకీయ విమర్శలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఉంటూ బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. అట్లాగే రాష్ట్ర ప్రజలంతా తన వంతుగా బాధితులకు సాయం అందించాలని కోరుతున్నా.

జమ్మూకాశ్మీర్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసి రాష్ట్ర హోదా ఇవ్వాలన్నదే బీజేపీ లక్ష్యం. అందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తున్నాం. ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. దేశ పౌరులంతా జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని కోరుకోవడంతోపాటు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అందుకే ‘‘ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్ నహీ చలేగా అంటూ 370 ఆర్టికల్ రద్దు చేసినం. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను ఇవ్వాలని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాదులతో లింకులున్న పార్టీలతో జత కట్టి మళ్లీ 370 ఆర్టికల్ ను తీసుకొచ్చి ఉగ్రవాద హోదాను పునరుద్దరించాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. దేశ ప్రజలారా... ఆలోచించండి. జమ్మూకాశ్మీర్ ప్రజలకు మీరంతా అప్పీల్ చేయండి’’ అని పిలుపునిచ్చారు.