18-02-2025 01:46:19 AM
కరీంనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ర్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవ హరిస్తున్న తీరును చూస్తుంఏ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నా రు. సోమవారం కరీంనగర్ లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్లో లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్‌లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గచేటన్నా రు.
సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సిందిపోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పు కున్నట్లయిందన్నారు. రాష్ర్టంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని వి మర్శించారు. రాష్ర్టంలో ప్రతి నిరుద్యోగికి 56 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ను బండకేసి బాదా లని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయట నుంచి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకుందని, బీఆర్‌ఎస్ అసలు పోటీలోనే లేదని, ఈసారి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యమని, ఎన్నికల ఫలితా ల తర్వాత నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చే దాకా రాష్ర్టంలో బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతుందన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొ క్కోంటుందని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారని, మరికొందరు క్రైస్త వులు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీల కు నష్టం చేస్తున్నారని అన్నారు.
ఇంత జరు గుతున్నా బీసీ, ఎస్సీ సంఘాలేం చేస్తున్నా యని, ఎందుకు స్పందించడం లేదని, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయడమే మీ పనా అని అన్నారు. ఒక వర్గా నికి కొమ్ముకాయాలని హిందూ సమాజా నికి తీరని నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పా లని సంజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్రావు, జి నగేశ్, ఎమ్మె ల్యేలే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్య క్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, పాల్గొన్నారు.