calender_icon.png 3 April, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదు

26-03-2025 01:02:48 AM

కొత్తపల్లి, మార్చి 25 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  దేశ ప్రజలకు సేవ చేసేది ఏమీ లేక చిల్లర మల్లర మాటలతోనే కాలయాపనచేసి.. పదవీకాలం వెళ్ళదీసేటట్టు ఉన్నాడని మాజీ కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు.

మంగళవారం నగరంలోని  కరీంనగర్ పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీకి  బండి సంజయ్ కుమార్ పైన బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  కొన్నాళ్లు మతం పేరు మీద రాజకీయం చేశాడని, ప్రస్తుతం ఒక అడుగు ముందుకేసి  తెలంగాణ ప్రదాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో  నిలిపిన కెసిఆర్ ను దొంగ నోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణను ఖండిస్తూ.. బండి సంజయ్ కుమార్ పైన పైన  పట్టణ ఏసిపి కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా బండి సంజయ్ కుమార్, ఇలాంటి చిల్లర మల్లర మాటలతో  కరీంనగర్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇలాంటి వాక్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే  కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారని, కార్పొరేటర్ గా కూడా గెలవకుండా చేస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్ , నగర టిఆర్‌ఎస్వి అధ్యక్షులు బొంకూరి మోహన్, నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఆరే రవి గౌడ్, వోడ్నాల రాజు , ఆఫ్రొజ్, సందీప్ వర్మ , కిరణ్ గౌడ్, అజయ్, సోహెల్, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.