calender_icon.png 8 January, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తోంది: బండి సంజయ్

05-01-2025 07:15:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రేపు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలపై రూ.32 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఒక్క ఏడాదిలోనే రూ.5 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేసిందని బండి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల(Telangana Elections) ముందు ఇచ్చిన 6 గ్యారంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ వెల్లడించారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పందని, ఇప్పుడు మాటమార్చి  రూ.12 వేలు ఇస్తామంటుందని మండిపడ్డారు. వానాకాలం రూ.6 వేలు కలిపి ఇప్పుడు మొత్తం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుభరోసా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోతే కనీసం మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించలేదని బండి సంజయ్ మండిపడ్డారు.