ఆందోల్ జనవరి 31 : ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పుల్కల్ మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బస్వాపూర్ మోడల్ స్కూల్ చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇది కేవలం బండి సంజయ్ వాక్యాలకే పరిమితం కాలేదని దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కుట్ర దాగి ఉందని ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ దళిత సంఘ నాయకులు మేతరి పోచయ్య మధుసూదన్ రాజు కరుణాకర్ రవి కుమార్ గిరి ప్రసాద్ ప్రకాష్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.