ఆందోల్,జనవరి 29 : జోగిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను బుధవారం నాడు దళిత సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఆందోల్ మండల అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటినుండి గద్దర్ పాత్ర కీలకమైంది అన్నారు.
మలిదశ ఉద్యమంలో గద్దర్ చూపించిన చొరవ ఈ ప్రాంత వాసులని ఎంతో ప్రభావితం చేసిందన్నారు. తెలంగాణ బిడ్డల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన గద్దర్ గురించి జ్ఞానం లేని మూర్ఖుడు మాట్లాడడం అవివేకం అన్నారు.
బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణలో బండి సంజయ్ కు గద్దర్ అభిమానులు అంతా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు దాసరి దుర్గయ్య బేగరి అనిల్ కుమార్, పెండ గోపాల్, సాటికే రాజు, తలారి నాని, లాలుసరి అజయ్ కుమార్ మేతరి సంతోష్ కుమార్ తలారి సురేష్, తదితరులు పాల్గొన్నారు