calender_icon.png 23 December, 2024 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుమ సంఘం నేత మీసా బీరయ్య మృతి పట్ల సంతాపం

11-09-2024 07:45:36 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కురుమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు  మీసా బీరయ్య అకాల మరణం పట్ల కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కురుమ సంఘ బాధ్యతలు నిర్వహించి, ఆ వర్గ శ్రేయస్సు అభివృద్ధి కోసం మీసా బీరయ్య ఎనలేని కృషి చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా కొనియాడారు. కరీంనగర్ ప్రజాక్షేత్రంలో  మీసా బీరయ్య  గుర్తింపు పొందిన నేతగా ఎదిగారని, కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా మీసా బీరయ్య సతీమణి రమాదేవి కార్పొరేటర్ రాణించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మీసా బీరయ్య ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.