సిద్దిపేట, జనవరి 29 (విజయక్రాంతి) : ప్రజా యుద్ధనౌక గద్దరన్నపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అసంబద్ధమైన వాఖ్యాలను ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు.
బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీహరి యాదవ్, ఆస లక్ష్మణ్, ఎస్వి శ్రీకాంత్, మెట్ల శంకర్, భీమ్ శేఖర్, తుక్కొజిగూడ సతీష్, పి. శంకర్ మాట్లాడుతు జీవితాంతం ప్రజల విముక్తి కోసం, నవ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు.
31న గద్దరన్న జయంతోత్సవం
ఈనెల31న శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగే గద్దరన్న 77 జయంతోత్సవాన్ని జయ ప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. రాష్ట ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిపే జయంతోత్సవానికి తరలి రావాలని కోరారు. గద్దరన్న జయంతిని అధికారికంగా జరపాలని ప్రభుత్వం జిఓ జారి చేసినందున అధికారికంగా జరపాలని కోరారు.