calender_icon.png 4 November, 2024 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్.. తిట్లపురాణం మానుకో

03-11-2024 01:50:03 AM

  1. జాతీయ రహదారి కోసం కేంద్రంతో పోరాడు
  2. రాష్ట్ర ప్రణాళిక సంఘం -మాజీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్

సిరిసిల్ల, నవంబర్ 2 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం మానుకుని, జాతీయ రహదారులపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కథలాపూర్, కోరుట్ల వరకు జాతీయ రహదారిని పొడిగించేలా బండి సంజయ్ కేంద్రంతో పోరాటం చేయాలన్నా రు. ఈ పనుల నిర్మాణంలో భూములు కో ల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుంటే పోరాటం చేస్తామన్నా రు. రాజమండ్రి మాదిరిగా సిరిసిల్ల మానేరు మీద వంతెన, కింద రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని గతంలో తాము సూచించినట్లు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి సైతం కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తాము ప్రతిపాదించిన పనులనే తీసుకెళ్లారని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు కొండూరు రవీందర్ రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ కళా, వైస్ చైర్మన్ రామారావు పాల్గొన్నారు.