నిర్మల్/కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల కోసం గజ్జకట్టి పాటలు పాడిన గద్దర్‌ను బండి సంజయ్ అవమానించారని మండిపడ్డారు. బండి సంజయ్ వెంటనే గద్దర్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్మల్‌లో నిర్వహించిన నిరసనలో జిల్లా అధ్య బత్తుల రంజిత్, నాయకులు సుధాకర్, మధు, అశోక్, సాయన్న, రాజేశ్వర్, జాకీర్ భూమన్న పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, మండల అధ్యక్షుడు సుతార్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు పాల్గొన్నారు.