calender_icon.png 24 October, 2024 | 1:33 PM

Breaking News

మూసీ పేరుతో కాంగ్రెస్‌ భారీ దోపిడీ స్కెచ్: బండి సంజయ్‌

24-10-2024 11:29:21 AM

కాళేశ్వరం బీఆర్ఎస్ ఏటీఎం.. మూసీ కాంగ్రెస్ ఏటీఎం

హైదరాబాద్: మూసీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ దోపిడీ స్కెచ్ వేసిందని కేంద్రంమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఆరోపించారు. మూసీ నది నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందన్న కేంద్రమంత్రి మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకోవానుకుంటుందని విమర్శించారు. మూసీ పేరుతో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేయడం దుర్మార్గమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. వడ్డీల రూపంలో 10 నెలల్లోనే రూ. 60 వేల కోట్లు కట్టారని బండి సంజయ్ లెక్క చెప్పారు. పాలకులు చేస్తున్న అప్పుల వల్ల ప్రజలపై భారం పడుతోందని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేతులెత్తేస్తోందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన బీజేపీ వ్యతిరేకం కాదన్న బండి సంజయ్ కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రేపు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేయనున్నట్లు తెలిపారు.