calender_icon.png 5 November, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీకి మేం వ్యతిరేకం కాదు: కేంద్రమంత్రి బండి సంజయ్

05-11-2024 02:14:10 PM

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కూరగాయల మార్కెట్, సీసీ రోడ్డును కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, రూ. 15 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అవుతోందని చెప్పారు. రూ. లక్షన్నర కోట్లతో మూసీ పనులు చేపట్టడానికి వ్యతిరేకం అన్నారు. మూసీ సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించమని బండి సంజయ్ హెచ్చరించారు. మూసీ టెండర్లను కాంగ్రెస్ హైకమాండ్ అల్లుడికి కట్టపెట్టాలని ప్రయత్నిస్తుందని ఆరోపించిన సంజయ్ హైడ్రా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మూసీ అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు.