పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జనవరి 28 (విజయ క్రాంతి): ప్రజావా గ్గేయకారుడు గద్దర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, వాటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రం గా ఖండిస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పద్మ అవార్డులకు పార్టీల రంగు పులమడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
బీజేపీలో తన ఉనికిని కాపాడుకునేందుకే కేంద్ర మంత్రి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలిపారు. గద్దర్ త్యాగాలు మరచిపోయి, ఆయన్ను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయ డం బండి సంజయ్ కుసంస్కారానికి తార్కాణమన్నారు.
అవార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా, గద్దర్‌కు ప్రజ ల మనసులో శాశ్వత స్థానం ఉందని, గద్దర్ ను ప్రధాన మంత్రి మోదీనే ప్రశంసించారని బండి సంజయ్ గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికా రు. గద్దర్ పాటతోనే వచ్చిందని బీజేపీ నా యకులు మరవొద్దని సూచించారు.