సిద్దిపేట/గజ్వేల్, ఆగస్టు 13: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సిద్దిపేట, గజ్వేల్‌లో మంగళవారం వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ఆటో కార్మికుల బంద్ పాటించారు. గజ్వేల్‌లో హిందువులు అంగడిపేట హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో హిందూ సంస్థల సభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హిందూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.