calender_icon.png 22 December, 2024 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విద్యాసంస్థల బంద్

04-07-2024 01:45:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి) : నీట్‌ను రద్దు చేయాలని, లీక్‌కు కారణమైన వారిని శిక్షించాలనే డిమాండ్‌తో నేడు దేశవ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్ కు అన్ని విద్యాసంస్థలు సహకరించాలని, బంద్‌ను విజయవంతం చేయా లని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవా రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, వీజేఎస్, పీవైఎల్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, వైజేఎస్ విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్‌టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.