calender_icon.png 27 November, 2024 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీల బంద్

27-08-2024 01:59:42 AM

 తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు

ఆదిలాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): ఆదివాసీల హక్కుల సాధన కోసం ఈనెల 27వ తేదీన రాష్ర్ట వ్యాప్తంగా ఏజెన్సీల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ర్ట కో కనీనర్ గోడం గణేశ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని కొమ్రం భీమ్ కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయయన మాట్లాడుతూ.. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలన్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. 40 ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలన్నారు.

ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవాలని, ఇలా అనేక సమస్యలపై రాష్ర్ట వ్యాప్తంగా ఏజెన్సీల బందుకు పిలుపునివడం జరిగిందని తెలిపారు.  బంద్‌కు 9 తెగల ఆదివాసీ ప్రజలు, అన్ని వర్గాల వాణిజ్య వర్తక వ్యాపారులు, ఆదివాసీ మద్దుతు ప్రకటించి బంద్‌లో పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తుడుం దెబ్బ నాయకులు వెట్టి మనోజ్, సలాం వరుణ్, గోడం రేణుక, ఇందిర,  సోయం లలిత, తోడసం ప్రకాశ్ తదితరులు ఉన్నారు.