calender_icon.png 20 January, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కారం కోసం రేపటి నుంచి బంద్

25-08-2024 09:16:43 PM

మంచిర్యాల, ఆగస్టు 25(విజయక్రాంతి): జిల్లాలో మార్బుల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు బంద్ నిర్వహిస్తున్నట్లు మార్బుల్ సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు శ్రీనివాస్ అన్నారు. ఆది వారం కాలేజ్ రోడ్ లోని మార్బుల్ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్బుల్ వేసే మేస్త్రీలు, కార్మికులు బుక్కు రేటు ప్రకారమే పని చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తక్కువ రేటుతో పని చేయడం వల్ల స్థానికంగా ఉన్న కార్మికులక పని దొరకడు లేడన్నారు. మార్బుల్ పని రేట్ల బుక్ లేకుంటే పని చేయరాదని, మేస్త్రీలు, కార్మికులు సంఘ సభ్యత్వం, జీవిత బీమా తీసుకోవాలని సూచించారు. ఈ బంద్కు ఇంటి యజమానులు, బిల్డర్ల సంఘం నాయకులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మార్బుల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ గని, కోశాధికారి ఎస్కే ఇలియాస్, మాజీ అధ్యక్షుడు మల్క చంద్రయ్య, సహాయ కార్యదర్శి బిల్లా మల్లేష్, సలహాదారులు పోలంపల్లి రాజకుమార్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.