calender_icon.png 13 January, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మండల అధ్యక్షులుగా బండారు వీరబాబు

12-01-2025 08:42:47 PM

నడిగూడెం (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా బండారు వీరబాబును నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ... ఒక జాతీయ పార్టీకి మండల అధ్యక్షులుగా ఎన్నిక చేసి నాపై నమ్మకంతో మండల పార్టీ బాధ్యతలు అప్పగించిన జిల్లా పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేస్తూ అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడానికి ఒక ప్రణాళిక రచించి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులను నియమించి ఆ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.