07-04-2025 01:08:03 AM
మానకొండూర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షునిగా పోలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియమించారు. ఈ మేరకు ఆదివారం పోలంపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలకు హాజరైన సందర్భంగా రమేష్ కు ఆయన నియామక పత్రం అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడుగా నూతనంగా నియామకమైన బండారు రమేష్ ను అభినందిస్తూ మండలంలో పార్టీ పటిష్టతకు, పార్టీ శ్రేణుల్లో ఐక్యతకు పాటుపడాలని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బొడిగె కొండయ్య, మామిడి అనిల్ కుమార్, కొత్త తిరుపతిరెడ్డి, భూదారపు శ్రీనివాస్, సిరిగిరి రంగారావు, గుంటి మల్లేశం, రెడ్డిగాని రాజు, కొత్తపల్లి వినోద్, డి సురేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.