calender_icon.png 5 March, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండారి దేవుడికి బండారు పూజలు

05-03-2025 12:49:10 AM

  • కొమురవెళ్లి మల్లన్నకు పట్నం, కొండపోచమ్మకు బోనం
  • కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించిన హర్యానా గవర్నర్ 
  • బండారు దత్తాత్రేయ హిందూ ధర్మరక్షణకు దేవాలయాలు ఎంతో అవసరం 
  • కొండపోచమ్మను దర్శించుకుని చాలా పవిత్రుడినయ్యా
  • ఆనందం వ్యక్తం చేసిన బండారు దత్తాత్రేయ

గజ్వేల్/చేర్యాల/జగదేవ్పూర్, మార్చి4: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని, కొండపోచమ్మ అమ్మవార్లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబసమేతంగా దర్శించుకున్నా రు. మంగళవారం కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో స్వామివారిని మెదక్ ఎంపీ రఘు నందన్‌రావుతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గర్భాలయం ఎదుట పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

వేదపండితులు బండారు దత్తాత్రేయను ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జగదేవ్పూర్ మండలం తీగుల్నర్సాపూర్ శివారుల్లోని కొండపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిలేబీతో తులాభారం నిర్వహించి అమ్మవారికి జిలేబి సమర్పించగా, దానిని భక్తులకు పంచిపెట్టారు. అనంతరం కురుమ రిజర్వేషన్ పోరాటసమితి నిర్వహించి సన్మా న కార్యక్రమంలో హర్యాన గవర్నర్ బండా రు దత్తాత్రేయ ప్రసంగించారు.

కొండపోచమ్మను దర్శించుకుని చాలా పవిత్రుడన య్యానన్నారు. ఆలయానికి చాలా విశిష్టత ఉందని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు ఎంతో అవసరమ న్నారు. సమాజానికి సేవ చేసే బాధ్యత కూ డా తనపై ఉందని, ఆలయాభివృద్ధికి తనవంతు సహాకారాన్ని అందిస్తానన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ఎంపీ నిధుల నుండి లేదా టీటీడీ సహకారంతో కొండపోచమ్మ ఆలయం వద్ద ఫంక్షన్హాలును నిర్మించడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ గాండ్ల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాద్,, కురుమ సంఘం నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా కొమురవెళ్లికి వచ్చిన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయకు కలెక్టర్ మనుచౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, ఆర్డీవో చంద్రకళలు పుష్ఫగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.