10-03-2025 01:34:54 AM
-కేంద్రమంత్రి బండి సంజయ్
మహబూబ్ నగర్, మార్చి 9 (విజయ క్రాంతి) : బిజెపి సీనియర్ నాయకులు బండారి శాంతి కుమార్ తండ్రి బండారి లక్ష్మణ్; ఇటీవల మరణించిన విషయం విధితమే. బండారి లక్ష్మణ్ మృతి తీరని లోటని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణిగుంట దగ్గర బండారి లక్ష్మణ్ దశదినకర్మ కార్యక్రమానికి విచ్చేసి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు మిథున్ రెడ్డి, తదితరులు ఉన్నారు.