calender_icon.png 7 February, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా బండలాగుడు పోటీలు

07-02-2025 12:00:00 AM

తలకొండపల్లి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన బండ లాగుడు పోటీలు కన్నుల పండుగగా వైభవంగా జరిగాయి.పోటీలలో ఏడు జతల కాడెద్దులు పాల్గొన్నాయి.

పోటీలలో మొదటి బహుమతి బైకని రామస్వామి ఎద్దుల జత రూ.20వేలు,రెండవ బహుమతి రాత్లావత్ బిచ్యనాయక్ రూ.15వేలు,మూడవ బహుమతిగా గొసుల కృష్ణయ్య ఎద్దులు రూ.10వేలను బహుమతిగా అందుకున్నాయి.

పోటీలను తిలకిం చేందుకు చుక్కాపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాలు ఎడవల్లి, చెన్నారం, ఖానాపూర్, పాతకోట తాండా, తాళ్లగుట్ట తాండా,సంగాయిపల్లితాండాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మొదటి బహుమతి బిఆర్‌ఎస్ నాయకుడు ఆమనగల్ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎన్ శ్రీనివాసరెడ్డి,రెండవ బహుమతి వంగూరి మహేష్,మూడవ బహుమతి కాగుల శేఖర్ లు సమకూర్చిన బహుమతులను విజేతలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,ఎన్ శ్రీనివాసరెడ్డి,మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య,మాజీ ఉపసర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి,మాకం వీరేశలింగం,బిక్కుమండ్ల శ్యాంసుందర్ గుప్త, యాదగిరి, పాండు, నర్శింహా, యాదయ్యగౌడ్, నర్శింహారెడ్డి, తుమ్మ నర్శింహా, పవన్ వాల్మీకి, రమేష్ యాదవ్, సత్తిరెడ్డి, కాలూరి నర్శింహా, విరాట్, శేఖర్, ఆలయ పూజారి వెంకటేశ్వరశర్మ లు పాల్గొన్నారు.