జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి
పటిష్టమైన భద్రతా, బందోబస్తు నిర్వహిస్తున్నాం
దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్, ఎస్ఐ హరీష్ గౌడ్
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామాల శివారులో గల బండ మల్లన్న జాతర ఉత్సవాలు ఈ నెల 14న మంగళవారం జరగనున్నాయి. ఆదివారం దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్, అక్బర్ పేట భూంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ తో కలిసి ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కావాల్సిన పోలీసు సిబ్బందితో పాటు ముగ్గురు ఎస్ఐ లతో ప్రతిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరలో దొంగలు, అపరిచితుల వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసరమైతే 100కు డయల్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండ మల్లన్న ఆలయ కమిటీ పాల్గొన్నారు.