calender_icon.png 21 September, 2024 | 12:10 PM

జిల్లాలో కొనసాగుతున్న ఆదివాసీల బంద్

21-09-2024 10:06:49 AM

ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన...

పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు...

ఏజెన్సీలో భారీగా పోలీస్ బందోబస్తు... 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఆదివాసీ మహిళపై ఎస్.కే మాగ్దుం అనే వ్యక్తి అత్యాచారయత్నం, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) తో పాటు వివిధ 9 తెగల ఆదివాసీ సంఘాలు కలిసి శనివారం బంద్ లో పాల్గొన్నాయి.

జైనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బంద్ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాలై ఉట్నూర్, నార్నూర్, గాది గూడ, ఇంద్రవెళ్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ పాటు జిల్లా వ్యాప్తంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసి బస్టాండ్ ఎదుట తుడుం దెబ్బ నాయకులు బైఠాయించి బస్సులు బైటకు రాకుండా అడ్డుకున్నారు. దింతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా తెరచి ఉన్న వ్యాపార వాణిజ్య, విద్య సంస్థలను ముసివేయిస్తున్నారు. అటు బంద్ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.