calender_icon.png 2 February, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్లెట్ గాయాలకు బ్యాండ్‌ఎయిడ్ చికిత్స

02-02-2025 12:17:57 AM

కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎడ్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పద్దుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స వంటిదని వ్యాఖ్యానించారు.

‘అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటివేళ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక నమూన అవసరం. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆలోచనలు కరవయ్యాయి. ఈ బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండ్‌ఎయిడ్ చికిత్స లాంటిది’ అంటూ రాహుల్ ధ్వజమెత్తారు.