01-03-2025 01:37:46 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 28(విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసం స్థలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల న్నారు.
ఇటీవల యోగానందిని విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆమె మృతికి కారణమైన వారిని చట్ట్ర పకారం శిక్షించాలన్నారు. ప్రభుత్వం స్పందించి కార్పోరేట్ విద్యాసంస్థల పై విచా రణ చేపట్టి నిబంధనలు పాటించని సంస్థల పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడ తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లెనిన్, నాయకులు అరుణ్ ,సుశాంత్, రవికాంత్ తదితరులున్నారు.