calender_icon.png 8 January, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట

07-01-2025 08:06:51 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ఆరంభించింది. ఈ మేరకు మంగళవారం బూర్గంపాడు మండలంలో పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమరవాణా చేస్తున్న దారులకు అడ్డంగా కందకాలు తవ్వించే పనులు చేపట్టారు. జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్, భూగర్భ జల వనరుల ఆర్ఐ పరశురాములు ఆ శాఖ సిబ్బంది, బూర్గంపాడు మండలం రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది కలిసి కందకాల పనిని చేపట్టారు. అధికారులు ముందుగా ఈ మండలం పరిధిలోని పినపాక పట్టీనగర్, బుడ్డగూడెం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం ఉపయోగిస్తున్న రహదారికి అడ్డంగా కందకాలు(గోతులు) తవ్వించారు. వారితో పాటు బూర్గంపాడు ఆర్ఐ నరసింహారావు, ఏఎస్ఐ మోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.