న్యూఢిల్లీ: భారత అథ్లెట్ దీపాన్షిపై జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులో దీపాన్షి విఫలం కావడంతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు నాడా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 21 ఏళ్ల దీపాన్షి ఇటీవలే జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియ న్‌షిప్‌లో (400 మీ ఈవెంట్) రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. టోర్నీ సందర్భంగా నాడా ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. దీపాన్షి నిషేధిత అనాబొలిక్ స్టెరాయిడ్ తీసుకున్నట్లు తన యూరిన్ శాంపిల్స్‌లో బయటపడినట్లు నాడా పేర్కొంది. దీంతో డోపింగ్ టెస్టులో దీపాన్షి విఫలమయిందని నిర్థారిస్తూ నాడా ఆమెపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.