calender_icon.png 27 April, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబీర్ గులాల్‌పై నిషేధం

25-04-2025 12:00:00 AM

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అబీర్ గులాల్’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఆర్తిఎస్ బగ్దీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటి వాణీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఇది పాకిస్థాన్ నటుడి మూవీ కావటంతో ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట వ్యతిరేకత మొదలైంది.

పహల్గాం ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను నిషేధిస్తున్నామని అధికారిక వర్గాలు వెల్లడించినట్టు జాతీయా మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా తఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు, యూట్యూబ్ (ఇండియా)లోనూ ఈ సినిమాకు సంబంధించిన పాటలను సైతం తొలగించారు.

ఈ విషయంపై మేకర్స్ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఉగ్రదాడిపై స్పందించకుండా.. అదే రోజు సోషల్‌మీడియా వేదికగా సినిమానను ప్రమోట్ చేశారంటూ వాణీకపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్‌పైనా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.