calender_icon.png 10 March, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కోను నిషేధించండి!

06-03-2025 12:00:00 AM

‘మార్కో ’ సినిమాపై నిషేధం వేటు పడింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) కేంద్రానికి లేఖ రాసింది. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ అదేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20న మలయాళంలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, ఆహాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తీసివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని సెన్సార్ బోర్డు తాజాగా కోరింది. చిన్నపిల్లలను క్రూరంగా చంపడం, గర్భిణిని, కళ్లులేని యువకుడిని చంపే సన్నివేశాలతో ఈ సినిమాను మరి దారుణంగా తెరకెక్కించారని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. టీవీల్లోనూ ఈ చిత్రాన్ని ప్రసారం చేయకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది.