12-02-2025 12:45:08 AM
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : రాష్ర్టంలోని 5 జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ ) జిల్లాకు వెయ్యి మంది చొప్పున 5వేల మంది మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు ప్రయోగాత్మకంగా చేపట్టుటకు గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్ణయించిందని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో రెండవ రోజు ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వెదురు సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చుండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద తీసుకోవడం జరిగిందన్నారు.
ఆయా మండలాల్లోని 1000 మంది మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించి వారికి వెదురు సాగుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అడిషనల్ డి ఆర్ డి ఓ నీలేష్, మూడు మండలాల డీపీఎంలు, ఏ పీ ఎం లు, సీసీలు, ఏపీవోలు, ఎఫ్ పి ఓ లు, బి ఓ డి లు, ఉద్యానవన శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ అధికారులు రమ్య, శ్రీకాంత్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.