రాష్ట్రపతిని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ, నవంబర్ 18: పంజాబ్ మాజీ సీఎం బియాంత్‌సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రపతి కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై 2 వారాల్లోగా నిర్ణయం తెలి యజేయాలని ధర్మాసనం అభ్యర్థించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయి దా వేసింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో 1995లో జరిగిన దాడుల్లో చండీగఢ్‌లోని సచివా లయం ఎదుట జరిగిన పేలుడులో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌సింగ్ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ౨౦౧౨లో క్షమాభిక్ష కోసం బల్వంత్ అర్జీ పెట్టగా అప్పటినుంచి పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది.