15-04-2025 11:46:33 PM
పోలీస్ బృందం వాహనం పేల్చివేత..
18 మందికి గాయాలు.. ఇద్దరి అపహరణ..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్ తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. మంగళవారం బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని మస్టంగ్ నుంచి వెళ్తున్న పోలీస్ బృందం వాహనాన్ని టార్గెట్ చేసి పేల్చారు. ఘటనలో 18 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. మరో ఇద్దరిని అపహరించారు. భద్రతా దళం కలాత్ క్యాంపునకు వెళ్లి తిరిగి ప్రత్యేక వాహనంలో వస్తుండగా దాడి సంభవించిందని ప్రభుత్వ ప్రతినిధి షహిద్ రిండ్ ప్రకటించారు. వాహనం పేల్చివేతకు తిరుగుబాటుదారులు ఐఈడీని వినియోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు తిరుగుబాటుదారుల దాడిని పాక్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని హెహబాజ్ షరీఫ్ ఖండింఇచారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.