calender_icon.png 6 November, 2024 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

26-07-2024 01:55:50 AM

  1. శత్రువుల క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం దీని సొంతం 
  2. డీఆర్‌డీవోకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు

న్యూఢిల్లీ, జూలై 25 : బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. 5 వేల కిలోమీటర్ల పరిధి గల క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకునే సామర్థ్యంతో దీన్ని రూ పొందించింది. ఈ పరీక్ష అన్ని అంశాల్లో ల క్ష్యాలను చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీన్ని విజయవంతం చేసిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అధికారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

దీన్ని భూమి, సముద్రంలో ప్రతిష్టించిన రాడా ర్ ఆయుధ వ్యవస్థ గుర్తించింది. వెంట నే ఇంటర్‌సెప్టర్ యాక్టివేట్ అయ్యి ంది. 4.24 గంటలకు ఫేజ్ ఏడీ ఎండో అట్మాస్ఫియరిక్ క్షిపణిని చాందీపూర్ నుంచి ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థకు శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉంటుంది. పరీక్ష నేపథ్య ంలో 10 వేల మందికి పైగా ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు.