23-03-2025 12:53:35 AM
సంగారెడ్డి, మార్చి 22 (విజయ క్రాంతి): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ శనివారం కోల్‌కతాలో ప్రారంభమైంది. మే 25 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతాయి. రెండు నెలలపాటు క్రికెట్ అభిమా నులు ఐపీఎల్ సంబరాల్లో మునిగిపోతారు. ఇదే సమయంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతాయి. విద్యార్థులు, యువత లక్ష్యంగా ఆన్‌లైన్, బహిరంగ బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు.
ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాకముందే బాగా ఆడే టీమ్స్‌ను బట్టి బెట్టింగ్‌లో రేటింగ్ పెడతారని తెలిసింది. ఒక ఓవర్‌లో ఎన్ని పరుగులు తీస్తారు.. బ్యాటర్ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఎన్ని ఓవర్లలో ఎంత స్కోర్ చేస్తాడు.. ఇలా మ్యాచ్‌లోని ప్రతీ అంశంపై బెట్టింగ్‌లు కడుతుంటారు. బంతి బంతికీ కూడా బెట్టింగ్‌లు కాస్తుంటారు.
ఐపీఎల్ సంరంభం మొదలుకాగానే బెట్టింగ్ బుకీలు సిద్ధమవుతుంటారు. ఐపీఎల్ మ్యాచ్ లో భారీగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో కొందరు సమాయత్తం అవుతున్నారని సమాచారం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మాఫియా బెట్టింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా క్రికెట్ కోసం యాప్‌లు వచ్చాయని సమాచారం.
దీంతో యువత ఫోన్ ద్వారా నేరుగా బెట్టింగ్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో ఓ ప్రాంతంలో ఉండి నగదును తీసుకొని నేరుగా ఒకరితో ఒకరు పందేలు కట్టేవారు. ఆ పరిస్థితులు ప్రస్తుతం లేవు. పంటర్లు, బుకీలు హోటళ్లు, లాడ్జిల్లో గదులను అద్దెకు తీసుకుని మ్యాచ్‌లో పై గెలుపు ఓటమిలపై పందేలు కాసేవారు.
ప్రస్తుతం కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇలాంటి పందేలు తగ్గిపోయాయి. సెల్ ఫోన్‌లోనే యువత బెట్టింగ్‌లుకాయడం, నగదు మార్పిడి జరిగిపోతుంటుంది. ఎవరు ఎవరికీ నగదు పంపిస్తారు.. ఎవరు బెట్టింగ్ నిర్వహిస్తారో..అనే విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లు పెట్టి ఇప్పటికే ఎంతో మంది లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.
కొందరు అప్పులు చేసి..తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అమాయకులు బలి అవుతుంటే బెట్టింగ్‌లో నిర్వాహకులు, బుకీలు మాత్రం కుబేరులవుతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొనాలని, తమ పిల్లలు ఐపీఎల్ బెట్టింగ్‌ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. బెట్టింగ్ కేసుల్లో చిక్కుకుని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై ఫిర్యాదులు
చర్యలు తీసుకోవాలని కోరిన మైనంపల్లి హన్మంతరావు, సంపత్ నాయక్
హైదరాబాద్ సిటీబ్యూరో, మేడ్చల్ మార్చి 22(విజయక్రాంతి): బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ నెల 17న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11మందిపై, 19న మి పోలీస్‌స్టేషన్‌లో 25మంది సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తాజాగా బెట్టింగ్ యా వ్యవహారంలోకి రాజకీయ పార్టీల నాయకులు రంగప్రవేశం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కఠినచర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేరేడ్‌మెట్ సీఐ సందీప్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
అలాగే ఉస్మా యూనివర్సిటీ ఏసీపీ గ్యార జగన్‌కు జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్‌నాయక్ ఫిర్యాదు చేశారు. నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలన్నారు. సెలబ్రిటీలు జూదాన్ని ప్రమోట్ చేయడం విచారకరమన్నారు.
ఓయూ పోలీ స్టేషన్ వద్ద సంపత్‌నాయక్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వ ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పో యూట్యూబర్ హర్షసాయి ముఖ్యకారణమని ఆరోపించారు. హర్ష పాటు జబర్దస్త్ వర్షపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ నటు డు అలీ సతీమణి జుబేదా యూట్యూబ్ చానెల్, లాస్య యూట్యూబ్ చానెల్‌ను పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యా దులో పేర్కొన్నారు.