calender_icon.png 17 January, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

11-07-2024 02:27:32 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం బుధవారం సనత్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి రథం ముందు ప్రత్యేక పూజ లు నిర్వహించి, గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బందోబస్తు నిర్వహిం చారు. అంతకు ముందు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీసీపీ విజయ్ కుమార్ ఆలయాన్ని సందర్శించి బందోబస్తు, రథోత్సవం ఏర్పాట్ల ను పరిశీలించారు.