calender_icon.png 23 December, 2024 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే వివేక్‌పై అనుచిత వాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్తాం

06-10-2024 08:07:06 PM

కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ గౌడ్, సుదర్శన్

మందమర్రి,(విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంటనే మానుకోవాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, మాజీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్షన్ లు హెచ్చరించారు. ఆదివారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.కాక వెంకట స్వామి కుటుంబం గత 70 సంవత్సరాలుగా చెన్నూరు నియోజవర్గం పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో వారు చేసిన సేవలు అభివృద్ధి  పనులు ప్రజలందరికీ తెలుసని కాకా కుటుంబాన్ని విమర్శించే ముందు పెద్దపెల్లి ఎంపీగా చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ నీ అక్రమాలు, దోపిడీ,అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇసుక దందా చేసి వందలాది లారీలు పెట్టి కేటీఆర్ తో  కుమ్ముకై లక్షలాది రూపాయలు సంపాదించి రాజ భోగాలు అనుభవిస్తూ ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు చేసిన తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భాలు మరిచి పోయావా  అని వారు ప్రశ్నించారు.

వివేక్ వెంకటస్వామి మీద పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని నువ్వు పైసలు ఎక్కడ పంచి దొరికావో ప్రజలకు తెలుసని వెంకటస్వామి కుటుంబం, వివేక్,వంశీకృష్ణ లపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని నీలాంటి వాళ్ళ బెదిరింపుల మూలంగా ప్రజలు నిన్ను అసహ్యించుకుంటు న్నారని నువ్వు ఎన్ని మాట్లాడినా,ఎన్ని చెప్పినా నిన్ను ప్రజలు నమ్మరనే విషయాన్ని గ్రహించాలని వారు హితవు పలికారు. మరోసారి వెంకటస్వామి కుటుంబం కోసం,వివేక్ పై అసహ్యంగా మాట్లాడితే ప్రజలు నిన్ను చెన్నూర్ లో, పెద్దపల్లి పార్లమెంట్ లో  అడుగు పెట్టకుండా తరిమికొట్టే రోజులు ముందున్నాయని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల  శ్రీనివాస్,సేవాలాల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్,పట్టణ ఉపాధ్యక్షులు కనకం రాజు, ఎండి సుకూర్, పట్టణ ప్రధాన కార్యదర్శి బూడిద శంకర్,  యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వడ్లూరు సునీల్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సోత్కు ఉదయ్ పాల్గొన్నారు.